Monday, 22 July 2013

శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామములు

శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామములు . 108 Names of  శ్రీ లక్ష్మి దేవి.

“లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం”

ఓం ప్రకృత్యై నమః
ఓం వికృత్యై నమః
ఓం విద్యాయై నమః
ఓం సర్వభూతహితప్రదాయై నమః
ఓం శ్రద్ధాయై నమః
ఓం విభూత్యై నమః
ఓం సురభ్యై నమః
ఓం పరమాత్మికాయై నమః
ఓం వాచే నమః
ఓం పద్మాలయాయై నమః (10)
ఓం పద్మాయై నమః
ఓం శుచ్యై నమః
ఓం స్వాహాయై నమః
ఓం స్వధాయై నమః
ఓం సుధాయై నమః
ఓం ధన్యాయై నమః
ఓం హిరణ్మయ్యై నమః
ఓం లక్ష్మ్యై నమః
ఓం నిత్యపుష్టాయై నమః
ఓం విభావర్యై నమః (20)
ఓం అదిత్యై నమః
ఓం దిత్యై నమః
ఓం దీప్తాయై నమః
ఓం వసుధాయై నమః
ఓం వసుధారిణ్యై నమః
ఓం కమలాయై నమః
ఓం కాంతాయై నమః
ఓం కామాక్ష్యై నమః
ఓం క్రోధసంభవాయై నమః
ఓం అనుగ్రహపరాయై నమః (30)
ఓం ఋద్ధయే నమః
ఓం అనఘాయై నమః
ఓం హరివల్లభాయై నమః
ఓం అశోకాయై నమః
ఓం అమృతాయై నమః
ఓం దీప్తాయై నమః
ఓం లోకశోక వినాశిన్యై నమః
ఓం ధర్మనిలయాయై నమః
ఓం కరుణాయై నమః
ఓం లోకమాత్రే నమః (40)
ఓం పద్మప్రియాయై నమః
ఓం పద్మహస్తాయై నమః
ఓం పద్మాక్ష్యై నమః
ఓం పద్మసుందర్యై నమః
ఓం పద్మోద్భవాయై నమః
ఓం పద్మముఖ్యై నమః
ఓం పద్మనాభప్రియాయై నమః
ఓం రమాయై నమః
ఓం పద్మమాలాధరాయై నమః
ఓం దేవ్యై నమః (50)
ఓం పద్మిన్యై నమః
ఓం పద్మగంథిన్యై నమః
ఓం పుణ్యగంధాయై నమః
ఓం సుప్రసన్నాయై నమః
ఓం ప్రసాదాభిముఖ్యై నమః
ఓం ప్రభాయై నమః
ఓం చంద్రవదనాయై నమః
ఓం చంద్రాయై నమః
ఓం చంద్రసహోదర్యై నమః
ఓం చతుర్భుజాయై నమః (60)
ఓం చంద్రరూపాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం ఇందుశీతులాయై నమః
ఓం ఆహ్లోదజనన్యై నమః
ఓం పుష్ట్యై నమః
ఓం శివాయై నమః
ఓం శివకర్యై నమః
ఓం సత్యై నమః
ఓం విమలాయై నమః
ఓం విశ్వజనన్యై నమః (70)
ఓం తుష్ట్యై నమః
ఓం దారిద్ర్య నాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
ఓం శాంతాయై నమః
ఓం శుక్లమాల్యాంబరాయై నమః
ఓం శ్రియై నమః
ఓం భాస్కర్యై నమః
ఓం బిల్వనిలయాయై నమః
ఓం వరారోహాయై నమః
ఓం యశస్విన్యై నమః (80)
ఓం వసుంధరాయై నమః
ఓం ఉదారాంగాయై నమః
ఓం హరిణ్యై నమః
ఓం హేమమాలిన్యై నమః
ఓం ధనధాన్య కర్యై నమః
ఓం సిద్ధయే నమః
ఓం స్త్రైణ సౌమ్యాయై నమః
ఓం శుభప్రదాయై నమః
ఓం నృపవేశ్మ గతానందాయై నమః
ఓం వరలక్ష్మ్యై నమః (90)
ఓం వసుప్రదాయై నమః
ఓం శుభాయై నమః
ఓం హిరణ్యప్రాకారాయై నమః
ఓం సముద్ర తనయాయై నమః
ఓం జయాయై నమః
ఓం మంగళాయై నమః
ఓం దేవ్యై నమః
ఓం విష్ణు వక్షఃస్థల స్థితాయై నమః
ఓం విష్ణుపత్న్యై నమః
ఓం ప్రసన్నాక్ష్యై నమః (100)
ఓం నారాయణ సమాశ్రితాయై నమః
ఓం దారిద్ర్య ధ్వంసిన్యై నమః
ఓం సర్వోపద్రవ వారిణ్యై నమః
ఓం నవదుర్గాయై నమః
ఓం మహాకాళ్యై నమః
ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఓం త్రికాల ఙ్ఞాన సంపన్నాయై నమః
ఓం భువనేశ్వర్యై నమః (108)

            ~   ఇతి శ్రీ లక్ష్మి దేవి అశోత్తర శత నామావళి సంపూర్ణం   ~

Sunday, 21 July 2013

వరలక్ష్మి వ్రతం

వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసం లో పౌర్ణిమ కు ముందు వోచే శుక్రవారం రోజు చేస్తారు. ఒక వేళ ఆ రోజు కుదరకుంటే, శ్రవణ మాసం లో ఎ శుక్రవారం ఐనా చేసుకోవొచ్చు. వరలక్ష్మి శుక్రవారం రోజు  వరలక్ష్మి అని అమ్మవారిని కొలిచి, పూజ చేసుకుంటారు.

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా
(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)
ఓం గోవిందాయ నమః (నీళ్ళు వదిలి వెయవలెను)
విష్ణవే నమః     మధుసూదనాయ నమః    త్రివిక్రమాయ నమః    వామనాయ నమః     శ్రీధరాయ నమః
ఋషీకేశాయ నమః     పద్మనాభాయ నమః   దామోదరాయ నమః     సంకర్షణాయ నమః   వాసుదేవాయ నమః

ప్రద్యుమ్నాయ నమః   అనిరుద్దాయ నమః    పురుషోత్తమాయ నమః   అధోక్షజాయ నమః    నారసింహాయ నమః
అచ్యుతాయ నమః    జనార్ధనాయ నమః    ఉపేంద్రాయ నమః      హరయే నమః     శ్రీ కృష్ణాయ నమః

ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమిభారకాః
ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే |
|

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)
ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్
(కుడిచేతితో ముక్కుపట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)
శుక్లాంబరధరం విష్ణుం  శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

ఓం లక్ష్మినారాయణభ్యయం నమః     శ్రీ ఉమామహేశ్వరాభ్యం నమః
శ్రీ వాణిహిరణ్యగర్భాభ్యం నమః     శ్రీ శచిపురంధరాభ్యం నమః
శ్రీ అరుంధతివసిష్టాభ్యం నమః    శ్రీ  సీతారామాభ్యం నమః
సర్వేభ్యో దేవేభ్యో నమః   మాతృభ్యో నమః,  పితృభ్యో నమః
ఓం మమోపాత్త దురితక్షయద్వారా శ్రీ మహా లక్ష్మి ప్రీత్యర్ధం అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షినములలొ ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) దక్షిణాయనే,వర్ష ఋతవ్, శ్రావణ మాసే, శుక్ల పక్షే ,  శుభ తిథౌ, శుక్రవాసరే,  శుభనక్షత్రే (ఈరోజు నక్షత్రము) శుభయోగే, శుభకరణే. ఏవంగుణ విశేషణ విషిష్ఠాయాం, శ్రీమాన్ (మీ గొత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య దైర్య విజయ అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం  థం,  ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, సత్సంతన సౌభాగ్య శుభఫలాప్యార్ధం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి  దేవతా ముధీశ్యా వరలక్ష్మి ప్రీత్యర్ధం భవిష్యోత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావద్బక్తి ద్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే
(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)
తదంగత్వేన కలశారాధనం కరిష్యే
శ్లో :  కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః
మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః
కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుందరా
ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడిఅరచేయినుంచి ఈ క్రిందిమంత్రము చదువవలెను.)
శ్లో : గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవపూజార్థం – మమ దురితక్షయకారకాః
కలశోదకేన పూజాద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుచు ఈ క్రింది మంత్రము చదువవలెను.)
మం :  ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రస్తవం
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి మీద అక్షతలు, గంధం పువ్వులు వేయవలెను .
ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాదిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః,ఫాలచంద్రాయ నమః,గజాననాయ నమః,వక్రతుండాయనమః,శూర్పకర్ణాయ నమః,హేరంబాయ నమః,స్కందపూర్వజాయ నమః,ఒం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాంసమ్ర్పయామి. మహాగణాదిపత్యేనమః ధూపమాఘ్రాపయామి.
ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్
సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

శ్రీ మహాగణాధిపతి బెల్లము OR పండ్లు గానీ ప్రసాదముగ  నివేదించాలి.  కర్పూర  నీరాజనం దర్శయామి. (కర్పూరమును వెలిగించి చూపవలెను).

వరలక్ష్మి పూజ విధానము :

అనంతరం శ్రీ వరలక్ష్మి  పూజ ప్రారంభం  –  వరలక్ష్మి ధ్యానమ్
పద్మసనే పద్మకరే సర్వలోకైక పూజితే,
నారాయణప్రియే దేవి సుప్రితాభవ సర్వదా,
క్షిరోదర్నవ సంభుతే కమలే కమలాలయే
సుస్థిరా భవమే దేహి సురాసుర నమస్త్రుతే ||
శ్రీ వరలక్ష్మి  దేవతాయే నమః ||  ద్యయామి

(అక్షింతలు వేయండి)
శ్లో: సర్వమంగళ మాంగళ్యే  విష్ణువక్షస్తలాలయే ,
ఆవాహయామి దేవీత్వాం సుప్రీతాభవ సర్వదా.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః ఆవాహయామి.

(నీళ్ళు చల్లండి )
శ్లో:  ఏహి దేవి గృహాణేదం రత్నసింహాసనం శుభం,
చంద్రకాంత మణిస్థంభ  సౌవర్ణం సర్వసుందరం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః రత్న సింహాసనం సమర్పయామి.

(అక్షింతలు చల్లండి )
శ్లో:  ఈశాది దేవ సంసేవ్యే భవే పాద్యం శుభప్రదే,
గంగాది సరితానీతం సంగృహాణ సురేశ్వరీ.
ఓం శ్శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పాదయో పాద్యం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )
శ్లో:  వాణీంద్రాణీ ముఖాసేవ్యే దేవదేవేశ వందితే,
గృహాణఅర్ఘ్యం మయాదత్తం విష్ణు పత్నీ నమోస్తుతే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి
.

(నీళ్ళు చల్లండి )
శ్లో:  శ్రీ మూర్తిశ్రితమందారే సర్వభాక్తాభి వందితే,
గృహాణ ఆచమనీయం దేవీ మయా దత్తం మహేశ్వరి.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః శుద్ధ ఆచమనీయం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )
శ్లో: వయోదధి ఘ్రుతోపేతం శర్కరా మధుసంయుతం
పంచామృత స్థానమిదం గృహాణ కమలాలాయే
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః పంచామృత స్థానం సమర్పయామి.

(పంచామృతం చల్లండి )
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం
శుదోద్దక స్నాన మిదం గృహాణ విధు సోదరి

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   శుదోద్దక స్నానం సమర్పయామి.

(నీళ్ళు చల్లండి )
సురార్చితాగ్నియుగలే పవన ప్రియే
వస్త్రయుగ్యం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   వస్త్రయుగ్యం సమర్పయామి.

( కొత్త బట్టలు లేదా పత్తి సమర్పించండి)
కేయూర కంకణే దివ్యహర నూపుర మేఖలా
విభూషణముల్యని గృహాణ ఋషి పూజితే

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   ఆభరణాని సమర్పయామి.

(కొత్త ఆభరణాలు ఉంటె లేదా అమ్మవారికి వేయండి)
తప్తహేమకృత దేవి మాంగల్యం మంగళప్రదం
మయా సమర్పితం దేవి గృహాణ త్వం శుభప్రదే

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః   మాంగల్యం సమర్పయామి.

(అమ్మవారికి మాంగల్యం సమర్పించండి)
శ్లో: కర్పూరాగరు సంయుక్తం, కస్తూరి రోచనాన్వితం.
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్ధం ప్రతి గృహ్యాతాం.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  శ్రీ గంధం సమర్పయామి.

(అమ్మవారికి శ్రీ గంధం, కుంకుమ సమర్పించండి)
శ్లో: అక్షతాన్ దవలాన్ దివ్యాన్ శాలియాన్ తండులాన్ శుభాన్
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యాతా మబ్ది పుత్రికే.
ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  అక్షతాన్ సమర్పయామి.

(అమ్మవారికి అక్షింతలు, పసుపు,కుంకుమ చల్లండి)
మల్లికా జాజి కుసుమచ్యకైరపిర్వకులైస్తధ
శతపత్రాయిచ్చ కలార్వై: పూజయామి పూజితే

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  పుష్పాణి సమర్పయామి.

(అమ్మవారికి పుష్పములు చల్లండి)

అధాంగ పూజ:

ఓం చంచలాయై నమః    -  పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః  -  జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై  నమః  -  ఊరూం పూజయామి
ఓం  కమలవాసిన్యై నమః  -  కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః  -  నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః  -  స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః  -  భుజాన్ పూజయామి
ఓం కంభుకంట్ట్యై నమః  – కన్ట్టం పూజయామి
ఓం సుముఖాయై నమః  -  ముఖం పూజయామి
ఓం శ్రియై నమః  -  ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః  -  నాసికాం పూజయామి
ఓం సునేత్ర్యై నమః -  నేత్రే పూజయామి
ఓం రమాయై నమః – కర్ణౌ పూజయామి
ఓం కమలాలయాయై నమః -  శిరః పూజయామి
ఓం శ్రీ వరలక్ష్మ్యే దేవ్యై నమః  -  సర్వాణ్యంగాని పూజయామి.

తరువాత శ్రీ వరలక్ష్మి అష్టోత్తర నామములు ( శ్రీ లక్ష్మి అస్తోతరములు) చదవండి ..

లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి .
శ్లో: దశాంగం గగ్గులో పేతం సుగంధం సుమనోహరం
ధూపం దాస్యామి తే దేవి వరలక్ష్మి గృహాణ త్వం

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  ధూపం సమర్పయామి.

(అగరు వత్తులను వెలిగించి దూపమును దేవికి చూపించవలెను. సాంబ్రాణి పొగను కూడా వేయవచ్చును )
శ్లో: ఘ్రుతావర్తి సంయుక్తం మంధకార వినాశకం
దీపం దాస్యామి తేదేవి గృహాణ ముదితా భవ.

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  దీపం సమర్పయామి.

(దీపమును దేవికి చూపించ వలెను )
నైవేద్యం షడ్రసోపేతం దధి మద్వాజ్య సంయుతం,
నానా భక్ష్య ఫలోపేతం గృహాణ హరి వల్లభే .

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నైవేద్యం సమర్పయామి

దేవికి ప్రత్యేకించి చేసిన పిండి వంటలు  దేవికి సమర్పించి నమస్కరించ వలెను.
ఘన సార సుగందేన మిశ్రితం పుష్ప వాసితం
పానీయం గృహ్యాతాం దేవి శీతలం సుమనోహరం .

ఓం శ్రీ వరలక్ష్మి దేవ్యై నమః  పానీయం సమర్పయామి.

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః పానీయం సమర్పయామి అని భోజనం అయిన తరువాత త్రాగుటకు నీరు ఇచ్చినట్లు భావించి కుడి చేత్తో నీటిని చూపుతూ ఎడమ చేత్తో గంట వాయించ వలెను.
పూగీ ఫల సమాయుక్తం నాగ వల్లీ దళైర్యుతం
కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతి గృహ్యాతాం .
ఓం  శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః తాంబూలం సమర్పయామి

( తమలపాకులు ,రెండు పోక చెక్కలు వేసి అమ్మవారికి వద్ద ఉంచాలి).

తరువాత కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి

నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవీ గృహ్యాతాం విష్ణు వల్లభే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నీరాజనం సమర్పయామి.

(కర్పూర హారతిని వెలిగించి హారతి పాటలు పాడ వచ్చును. )

పద్మాసనే పద్మ కరే సర్వ లోకైక పూజితే ,
నారాయణ ప్రియే దేవి సుప్రీతో భవ సర్వదా ||
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః మంత్ర పుష్పం సమర్పయామి.

(పువ్వులు ,అక్షతలు చేతిలోనికి తీసుకుని ,లేచి నిలబడి నమస్కరించి ఈ పువ్వులు ,అక్షతలు దేవిపై వేసి కూర్చోన వలెను.)

యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ,
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే.
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి
( అక్షతలు ,పువ్వులు తీసుకుని లేచి నిలబడి మూడు సార్లు ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షతలు పువ్వులు దేవిపై వేయవలెను )

తోర బంధన మంత్రము :

బద్నామి దక్షిణ హస్తే నవసూత్రం శుభప్రదం
పుత్రా పౌత్రాభి వృదించ సౌభాగ్యం దేహిమే రమే

ఓం శ్రీ వరలక్ష్మీ దేవ్యై నమః పునః పూజాంచ కరిష్యే అని చెప్పుకుని, పంచ పాత్రలోని నీటిని చేతితో తాకి ,అక్షతలు దేవిపై చల్లుతూ ఈ క్రింది మంత్రములు చదువు కొనవలెను .
ఛత్రం ఆచ్చాదయామి ,చామరం వీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి .సమస్త రాజోపచార ,శక్త్యోప చార ,భక్త్యోపచార పూజాం సమర్పయామి. అనుకొని ,నమస్కరిస్తూ ఈ క్రింది శ్లోకమును చదువు కొనవలెను .
ఏతత్ఫలం శ్రీ వరలక్ష్మీ మాతార్పణ మస్తు అంటూ అక్షతలు నీటితో పాటు అరవేణంలో వదలవలెను . పిమ్మట ‘ శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసాగృహ్ణామి.’ అనుకుని దేవి వద్ద అక్షతలు తీసుకుని తమ తమ తలలపై వేసుకొనవలెను.

అక్షింతలు చేతిలో వేసుకొని వరలక్ష్మీ వ్రత కధ చదవండి లేక వినండి ;

వరలక్ష్మీ వ్రత కధ

అక్షింతలు చేతిలో వేసుకొని వరలక్ష్మీ వ్రత కధ చదవండి లేక వినండి

వరలక్ష్మీ వ్రత కధా ప్రారంభము

సూత పౌరాణి కుండు శౌనకుడు మొదలగు మహర్షులను చూచి యిట్లనియె : ముని వర్యులారా స్త్రీలకు సకల సౌభాగ్యములు కలుగునట్టి ఒక వ్రత రాజంబును పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పెను. దానిని చెప్పెదను వినుడు.
ఒకప్పుడు కైలాస పర్వతమున వజ్రములు, వైడూర్యములు, మణులు, మొదలగు వాటితో కూడిన సింహాసన మందు పరమేశ్వరుడు కూర్చుండి యుండగా పార్వతీ దేవి పరమేశ్వరునకు నమస్కరించి ‘దేవా ! లోకమున స్త్రీలు ఏ వ్రతము చేసినచో సర్వ సౌభాగ్యములు ,పుత్ర పౌత్రాదులు కలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతము నాకు చెప్పు మనిన ఆ పరమేశ్వరుడు ఈ విధంగా పలికెను. ‘ఓ మనోహరీ ! స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులను కలుగ చేసెడి వరలక్ష్మీ వ్రతము అను ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ర పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము నాడు చేయవలయు ‘ ననిన పార్వతీ దేవి యిట్లనియె . ‘ఓ లోకారాధ్యా ! నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతమును ఎట్లు చేయ వలయును? ఆ వ్రతమునకు విధియేమి? ఏ దేవతను పూజింప వలయును? పూర్వము ఎవరిచే ఈ వ్రతము ఆచరింప బడినది? వీని నెల్ల వివరముగా చెప్ప వలయు ‘ నని ప్రార్ధింపగా పరమేశ్వరుండు పార్వతీ దేవిని చూచి యిట్లనియె – ‘ఓ కాత్యాయినీ ! వరలక్ష్మీ వ్రతము వివరముగా చెప్పెదను వినుము. మగధ దేశమున కుండినము అను నొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబుల తోడను ,బంగారు గోడలు గల ఇండ్ల తోడను గూడి యుండెను.అట్టి పట్టణము నందు చారుమతి యను నొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితా మణి పెనిమిటిని (భర్తని ) దేవునితో సమానముగా తలచి ప్రతి దినమును ఉదయమున మేల్కొని స్నానము చేసి పుష్పములచే పెనిమిటిని (భర్తను ) పూజ చేసిన పిదప అత్త మామలకు అనేక విధములైన ఉపచారములు చేసి ఇంటి పనులను చేసికొని ,గయ్యాళి గాక మితముగాను ,ప్రియముగాను భాషించుచు నుండెను.
ఇట్లుండగా ఆ మహా పతివ్రత యందు మహాలక్ష్మీ దేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నంబున ప్రసన్నయై ‘ ఓ చారుమతీ ! నేను వరలక్ష్మీ దేవిని ,నీయందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్ష మైతిని .శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్ర వారము నాడు నన్ను సేవించినచో నీకు కోరిన వరములిచ్చెద ‘ నని వచించెను. చారుమతీ దేవి స్వప్నములోనే వరలక్ష్మీ దేవికి ప్రదక్షణ నమస్కారములు చేసి -
శ్లో || నమస్తే సర్వ లోకానాం జనన్యై పుణ్య మూర్తయే ,
శరణ్యే త్రిజగ ద్వంద్వే విష్ణు వక్ష స్థలా లయే||

అని అనేక విధముల స్తోత్రము చేసి ‘ఓ జగజ్జననీ ! నీ కటాక్షంబు గలిగె నేని జనులు ధన్యులగును, విధ్వాంసులుగను , సకల సంపన్నులుగను, నయ్యెదరు. నేను నా జన్మాంతరమున చేసిన పుణ్య విశేషము వలన మీ పాడ దర్శనము నాకు కలిగెనని నమస్కరించెను. మహాలక్ష్మి సంతోషము చెంది చారుమతికి అనేక వరములిచ్చి అంతర్దానంబు (అదృశ్య మయ్యెను ) నొందెను. చారుమతి తక్షణంబున (వెంటనే ) నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలం జూచి వరలక్ష్మీ దేవిని గానక ‘ ఓహొ ! మనము కలగంటి ‘మని ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటి (భర్త ) – మామగారు మొదలైన వారితో చెప్పగా , వారు ‘ ఈ స్వప్నము చాలా ఉత్తమ మైనదని ,శ్రావణ మాసము వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతమును తప్పక చేయవలసిన ‘దని , చెప్పిరి.
పిమ్మట చారుమతీ దేవియును ,స్వప్నంబును విన్న స్త్రీలను శ్రావణ మాసము ఎప్పుడు వచ్చునా యని ఎదురు చూచు చుండిరి . ఇట్లుండగా వీరి భాగ్యో దయంబున (అదృష్టము వలన ) శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చెడి శుక్రవారము వచ్చెను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరును ఈ దినమే కదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినమని ఉదయంబునే మేల్కాంచి స్నానము చేసి శుభ్రమైన వస్త్రములను కట్టుకుని చారుమతీ దేవి గృహమున ఒక ప్రదేశము నందు గో మయంబుచే (ఆవు పేడచే) అలికి మంటపమును ఏర్పరిచి అందు ఒక ఆసనము వైచి దానిపై బియ్యము పోసి కలశం ఏర్పరిచి అందు వరలక్ష్మీ దేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తి యుక్తులై సాయంకాలమున -

శ్లో || పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణ ప్రియై దేవీ సుప్రీతా భవ సర్వదా ||

అను శ్లోకముచే ధ్యానా వాహనాది షోడశోపచార పూజలను చేసి తొమ్మిది సూత్రములు గల తోరములను దక్షిణ హస్తమున (కుడి చేతి యందు ) కట్టుకుని వరలక్ష్మీ దేవికి నానా విధ భక్ష్య భోజ్యంబులను (అన్ని రకముల పిండి వంటలను ) నైవేద్యము చేసి , ప్రదక్షిణము చేసిరి .
ఇట్లొక ప్రదక్షిణము చేయగా నా స్త్రీలకందరికి కాళ్ళ యందు ఘల్లు ఘల్లు మను నొక శబ్దము కలిగెను .అంత కాళ్ళను జూచుకొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగి యుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ ‘ఓహొ ! ఇవి వరలక్ష్మీ దేవి కటాక్షము వలన కలిగినవి ‘ అని పరమానందము పొంది మరియొక ప్రదక్షణము చేసిన హస్తములందు ధగ ధగ మెరయు చుండు నవరత్న ఖచితములైన కంకణములు మొదలగు ఆభరణములు ఉండుట చూచిరి.

ఇంక చెప్పనేల ! మూడవ ప్రదక్షణము చేసిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వ భూషణ అలంకార భూషిత లయి చారుమతి మొదలగు ఆ స్త్రీల గృహముల నెల్ల స్వర్ణ మయము లయి (బంగారముతో నిండి ) రధ గజ తురగ (రధములు, ఏనుగులు ,గుర్రములతో ) వాహనముల తోడ నిండి యుండెను.
అంత ఆ స్త్రీలను తీసికొని గృహములకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు ,ఏనుగులు, రధములు ,బండ్లను వరలక్ష్మీ దేవిని పూజించు చుండు స్థలమునకు వచ్చి నిలిచి యుండెను .పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి పండ్రెండు కుడుములు ,పాయస దానంబిచ్చి దక్షిణ తాంబూలముల నొసంగి నమస్కారము చేసి బ్రాహ్మణో త్తమునిచే ఆశీర్వాదంబు నొంది వరలక్ష్మీ దేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బందువుల తోడ ఎల్లరును భుజించి , తమ కొరకు వచ్చి కాచుకొని యున్న గుర్రములు ,ఏనుగులు, మొదలగు వాహనముల నెక్కి తమ తమ ఇళ్ళకు పోయిరి. అపుడు వారు ఒకరితో నొకరు ‘ ఆహా ! చారుమతీ దేవి భాగ్యంబే మని చెప్ప వచ్చును. వరలక్ష్మీ దేవి తనంతట తానే స్వప్నములో వచ్చి ప్రత్యక్ష మయ్యెను. ఆ చారుమతీ దేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగేనని చారుమతీ దేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయి చేరిరి . నాటి నుండి యు చారుమతి మొదలగు స్త్రీ లందరును ప్రతి సంవత్సరము ఈ వ్రతంబు చేయుచూ పుత్ర పౌత్రాభి వృద్ది కలిగి ధన కనక వస్తు వాహనముల తోడ గూడుకుని సుఖంబుగ నుండిరి.
కావున ఓ పార్వతీ ! యీ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది నాలుగు జాతులవారును చేయవచ్చును .అటు లొనర్చిన సర్వ సౌభాగ్యములు కలిగి సుఖముగ నుందురు .ఈ కథను విను వారలకు ,చదువు వారలకు వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్దించును.
ఆ చారుమతీ దేవి చేసిన వ్రతమును లోకమంతా చేశారు .లోకమంతా చేసిన వ్రతమును మనమూ చేశాము .వ్రత లోపమైనా కధ లోపం కారాదు. భక్తి  తప్పినా ఫలం తప్పరాదు.సర్వే జనాః సుఖినో భవంతు అని నమస్కారము చేయవలెను.

ఇది భవిష్యోత్తర పురాణము నందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రత కల్ప కధా సంపూర్ణము.
ఆ పిదప పసుపు గణపతి ఉన్న పళ్ళెము నొకసారి పైకి ఎత్తి తిరిగి క్రింద ఉంచి పళ్ళెము లో ఉన్న పసుపు గణపతిని తీసి దేవుని పీటము పై ఉంచ వలెను. దీనిని ఉద్వాసన చెప్పటం అంటారు.
యస్య స్మృత్యాచ నోమోక్త్యాత పః పూజా క్రియాది షు,
న్యూనం సంపూర్ణ తాం యాతి సద్యో వందే తమచ్యుతం ,
మంత్ర హీనం క్రియాహీనం భక్తి హీనం జనార్ధన ,
యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే.
అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయాచ భగవాన్సర్వాత్మకః

శ్రీ వరలక్ష్మీ దేవతా స్సుప్రీతో వరదో భవతు ,శ్రీ వరలక్ష్మీ దేవతా ప్రసాదం శిరసా గృహ్ణామి .
ఇతి పూజా విధానమ్ సంపూర్ణమ్

శ్రీ వరలక్ష్మీ వాయనదానము:

ఇచ్చేవారు               :     ఇందిరా ప్రతిగృహ్ణాతు
పుచ్చుకునేవారు      :     ఇందిరావై దదాతిచ
ఇద్దరు                     :     ఇందిరాతారకోభాభ్యా ఇందిరాయై నమోనమః
ఇచ్చేవారు               :      ఇస్తినమ్మవాయణం
పుచ్చుకునేవారు      :      పుచ్చుకున్తినమ్మ వాయనం
వాయనమిచ్చినవారు, పుచ్చుకున్నవారికి నమస్కరించాలి.

శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః వాయన దానం సమర్పయామి అనుకుని శనగలు (నాన బెట్టినవి ),తాంబూలం (మూడు ఆకులు ,వక్క , అరటి పండు ), రవికల (జాకెట్టు )గుడ్డ ,పువ్వులు మరియు తయారు చేసిన పిండి వంటలను ఒక పళ్ళెము లోనికి 9 రకములు రకమునకు 9 వంతున గాని (లేదా ఎవరి శక్తి అనుసారముగా వారు ) తీసుకుని మరొక పళ్ళెము తో మూసి పైన కొంగును కప్పి ముత్తైదువుకు బొట్టు పెట్టి ఆమెను వరలక్ష్మీ దేవిగా భావించి ఈ వాయనమును అందిస్తూ ఇచ్చువారు ఇస్తినమ్మ వాయనం అని, పుచ్చుకున్నవారు పుచ్చు కొంటినమ్మ వాయనం అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,నా వాయనం అందుకున్నదెవరు అని ఇచ్చేవారు ,నేనమ్మా వరలక్ష్మీ దేవిని అని పుచ్చుకునేవారు అనాలి . ఈ విధంగా మూడు సార్లును ,అడిగితి వరం అని ఇచ్చువారు ,ఇస్తి వరం అని పుచ్చు కొనువారు మూడు సార్లు అనాలి .ఈ విధంగా వాయనమును దేవికి సమర్పించి నమస్కరించవలెను.
ఆ రోజు సాయంత్రము ముత్తైదువులను పిలిచి పేరంటం చేసుకొన వచ్చును. (పేరంటం అనగా పసుపు ,కుంకుమ , గంధం, ముత్తైదువులకు ఇచ్చి శనగలు (నాన బెట్టినవి ), తాంబూలం (మూడు ఆకులు ,వక్క ,అరటి పండు ), రవికల (జాకెట్టు ) గుడ్డ ,పువ్వులు ఇవ్వ వలెను.

శ్రీ శివాష్టోత్తర శతనామ స్తోత్రం

శివో మహేశ్వరశ్శంభుః పినాకీ శశిశేఖరః
వామదేవో విరూపాక్షః కపర్దీ నీలలోహితః || 1 ||

శంకరశ్శూలపాణిశ్చ ఖట్వాంగీ విష్ణువల్లభః
శిపివిష్టోంబికానాథః శ్రీకంఠో భక్తవత్సలః || 2 ||

భవశ్శర్వస్త్రిలోకేశశ్శితికంఠశ్శివప్రియః
ఉగ్రః కపాలీ కామారీ అంధకాసురసూదనః || 3 ||

గంగాధరో లలాటాక్షః కాలకాలః కృపానిధిః
భీమః పరశుహస్తశ్చ మృగపాణిర్జటాధరః || 4 ||

కైలాసవాసీ కవచీ కఠోరస్త్రిపురాంతకః
వృషాంకో వృషభారూఢో భస్మోద్ధూళితవిగ్రహః || 5 ||

సామప్రియస్స్వరమయస్త్రయీమూర్తిరనీశ్వరః
సర్వజ్ఞః పరమాత్మా చ సోమసూర్యాగ్నిలోచనః || 6 ||

హవిర్యజ్ఞమయస్సోమః పంచవక్త్రస్సదాశివః
విశ్వేశ్వరో వీరభద్రో గణనాథః ప్రజాపతిః || 7 ||

హిరణ్యరేతః దుర్ధర్షః గిరీశో గిరిశోనఘః
భుజంగభూషణో భర్గో గిరిధన్వీ గిరిప్రియః || 8 ||

కృత్తివాసః పురారాతిర్భగవాన్ ప్రమథాధిపః
మృత్యుంజయస్సూక్ష్మతనుర్జగద్వ్యాపీ జగద్గురుః || 9 ||

వ్యోమకేశో మహాసేనజనకశ్చారువిక్రమః
రుద్రో భూతపతిః స్థాణురహిర్భుధ్నో దిగంబరః || 10 ||

అష్టమూర్తిరనేకాత్మా సాత్త్వికశ్శుద్ధవిగ్రహః
శాశ్వతః ఖండపరశురజః పాశవిమోచకః || 11 ||

మృడః పశుపతిర్దేవో మహాదేవోzవ్యయో హరిః
భగనేత్రభిదవ్యక్తో దక్షాధ్వరహరో హరః || 12 ||

పూషదంతభిదవ్యగ్రో సహస్రాక్షస్సహస్రపాత్
అపవర్గప్రదోzనంతస్తారకః పరమేశ్వరః || 13 ||

ఏవం శ్రీ శంభుదేవస్య నామ్నామష్టోత్తరంశతమ్ ||

Saturday, 20 July 2013

శ్రీ లలిత అష్టోత్తర శతనామావళి

రజతాచలశృంగాగ్రమధ్యస్థాయై నమో నమః |
హిమాచలమహావంశపావనాయై నమో నమః || 1 ||


శంకరార్ధాంగసౌందర్యలావణ్యాయ నమో నమః |
లసన్మరకతస్వచ్ఛవిగ్రహాయై నమో నమః || 2 ||


మహాతిశయసౌందర్యలావణ్యాయై నమో నమః |
శశాంకశేఖరప్రాణవల్లభాయై నమో నమః || 3 ||


సదాపంచదశాత్మైక్యస్వరూపాయై నమో నమః |
వజ్రమాణిక్యకటకకిరీటాయై నమో నమః || 4 ||


కస్తూరీతిలకోల్లాసనిటిలాయై నమో నమః |
భస్మరేఖాంకితలసన్మస్తకాయై నమో నమః || 5 ||


వికచాంభోరుహదళలోచనాయై నమో నమః |
శరచ్చాంపేయపుష్పాభనాసికాయై నమో నమః || 6 ||


లసత్కాంచనతాటంకయుగళాయై నమో నమః |
మణిదర్పణసంకాశకపోలాయై నమో నమః || 7 ||


తాంబూలపూరితస్మేరవదనాయై నమో నమః |
సుపక్వదాడిమీబీజరదనాయై నమో నమః || 8 ||


కంబుపూగసమచ్ఛాయకంధరాయై నమో నమః |
స్థూలముక్తాఫలోదారసుహారాయై నమో నమః || 9 ||


గిరీశబద్ధమాంగల్యమంగలాయై నమో నమః |
పద్మపాశాంకుశలసత్కరాబ్జాయై నమో నమః || 10 ||


పద్మకైరవమందారసుమాలిన్యై నమో నమః |
సువర్ణకుంభయుగ్మాభసుకుచాయై నమో నమః || 11 ||


రమణీయచతుర్బాహుసంయుక్తాయై నమో నమః |
కనకాంగదకేయూరభూషితాయై నమో నమః || 12 ||


బృహత్సౌవర్ణసౌందర్యవసనాయై నమో నమః |
బృహన్నితంబవిలసజ్జఘనాయై నమో నమః || 13 ||


సౌభాగ్యజాతశృంగారమధ్యమాయై నమో నమః |
దివ్యభూషణసందోహరంజితాయై నమో నమః || 14 ||


పారిజాతగుణాధిక్యపదాబ్జాయై నమో నమః |
సుపద్మరాగసంకాశచరణాయై నమో నమః || 15 ||


కామకోటిమహాపద్మపీఠస్థాయై నమో నమః |
శ్రీకంఠనేత్రకుముదచంద్రికాయై నమో నమః || 16 ||


సచామరరమావాణీవీజితాయై నమో నమః |
భక్తరక్షణదాక్షిణ్యకటాక్షాయై నమో నమః || 17 ||


భూతేశాలింగనోద్భూతపులకాంగ్యై నమో నమః |
అనంగజనకాపాంగవీక్షణాయై నమో నమః || 18 ||


బ్రహ్మోపేంద్రశిరోరత్నరంజితాయై నమో నమః |
శచీముఖ్యామరవధూసేవితాయై నమో నమః || 19 ||


లీలాకల్పితబ్రహ్మాండమండలాయై నమో నమః |
అమృతాదిమహాశక్తిసంవృతాయై నమో నమః || 20 ||


ఏకాతపత్రసామ్రాజ్యదాయికాయై నమో నమః |
సనకాదిసమారాధ్యపాదుకాయై నమో నమః || 21 ||


దేవర్షిభిస్స్తూయమానవైభవాయై నమో నమః |
కలశోద్భవదుర్వాసఃపూజితాయై నమో నమః || 22 ||


మత్తేభవక్త్రషడ్వక్త్రవత్సలాయై నమో నమః |
చక్రరాజమహాయంత్రమధ్యవర్త్యై నమో నమః || 23 ||


చిదగ్నికుండసంభూతసుదేహాయై నమో నమః |
శశాంకఖండసంయుక్తమకుటాయై నమో నమః || 24 ||


మత్తహంసవధూమందగమనాయై నమో నమః |
వందారుజనసందోహవందితాయై నమో నమః || 25 ||


అంతర్ముఖజనానందఫలదాయై నమో నమః |
పతివ్రతాంగనాభీష్టఫలదాయై నమో నమః || 26 ||

అవ్యాజకరుణాపూరపూరితాయై నమో నమః |
నితాంతసచ్చిదానందసంయుక్తాయై నమో నమః || 27 ||


సహస్రసూర్యసంయుక్తప్రకాశాయై నమో నమః |
రత్నచింతామణిగృహమధ్యస్థాయై నమో నమః || 28 ||


హానివృద్ధిగుణాధిక్యరహితాయై నమో నమః |
మహాపద్మాటవీమధ్యనివాసాయై నమో నమః || 29 ||


జాగ్రత్స్వప్నసుషుప్తీనాం సాక్షిభూత్యై నమో నమః |
మహాపాపౌఘపాపానాం వినాశిన్యై నమో నమః || 30 ||


దుష్టభీతిమహాభీతిభంజనాయై నమో నమః |
సమస్తదేవదనుజప్రేరికాయై నమో నమః || 31 ||


సమస్తహృదయాంభోజనిలయాయై నమో నమః |
అనాహతమహాపద్మమందిరాయై నమో నమః || 32 ||


సహస్రారసరోజాతవాసితాయై నమో నమః |
పునరావృత్తిరహితపురస్థాయై నమో నమః || 33 ||


వాణీగాయత్రీసావిత్రీసన్నుతాయై నమో నమః |
రమాభూమిసుతారాధ్యపదాబ్జాయై నమో నమః || 34 ||


లోపాముద్రార్చితశ్రీమచ్చరణాయై నమో నమః |
సహస్రరతిసౌందర్యశరీరాయై నమో నమః || 35 ||


భావనామాత్రసంతుష్టహృదయాయై నమో నమః |
సత్యసంపూర్ణవిజ్ఞానసిద్ధిదాయై నమో నమః || 36 ||


శ్రీలోచనకృతోల్లాసఫలదాయై నమో నమః |
శ్రీసుధాబ్ధిమణిద్వీపమధ్యగాయై నమో నమః || 37 ||


దక్షాధ్వరవినిర్భేదసాధనాయై నమో నమః |
శ్రీనాథసోదరీభూతశోభితాయై నమో నమః || 38 ||


చంద్రశేఖరభక్తార్తిభంజనాయై నమో నమః |
సర్వోపాధివినిర్ముక్తచైతన్యాయై నమో నమః || 39 ||


నామపారయణాభీష్టఫలదాయై నమో నమః |
సృష్టిస్థితితిరోధానసంకల్పాయై నమో నమః || 40 ||


శ్రీషోడశాక్షరీమంత్రమధ్యగాయై నమో నమః |
అనాద్యంతస్వయంభూతదివ్యమూర్త్యై నమో నమః || 41 ||


భక్తహంసపరీముఖ్యవియోగాయై నమో నమః |
మాతృమండలసంయుక్తలలితాయై నమో నమః || 42 ||


భండదైత్యమహాసత్త్వనాశనాయై నమో నమః |
క్రూరభండశిరచ్ఛేదనిపుణాయై నమో నమః || 43 ||


ధాత్రచ్యుతసురాధీశసుఖదాయై నమో నమః |
చండముండనిశుంభాదిఖండనాయై నమో నమః || 44 ||


రక్తాక్షరక్తజిహ్వాదిశిక్షణాయై నమో నమః |
మహిషాసురదోర్వీర్యనిగ్రహాయై నమో నమః || 45 ||


అభ్రకేశమహోత్సాహకారణాయై నమో నమః |
మహేశయుక్తనటనతత్పరాయై నమో నమః || 46 ||


నిజభర్తృముఖాంభోజచింతనాయై నమో నమః |
వృషభధ్వజవిజ్ఞానభావనాయై నమో నమః || 47 ||


జన్మమృత్యుజరారోగభంజనాయై నమో నమః |
విధేయముక్తవిజ్ఞనసిద్ధిదాయై నమో నమః || 48 ||


కామక్రోధాదిషడ్వర్గనాశనాయై నమో నమః |
రాజరాజార్చితపదసరోజాయై నమో నమః || 49 ||


సర్వవేదాంతసంసిద్ధసుతత్త్వాయై నమో నమః |
శ్రీవీరభక్తవిజ్ఞానవిధానాయై నమో నమః || 50 ||


అశేషదుష్టదనుజసూదనాయై నమో నమః |
సాక్షాచ్ఛ్రీదక్షిణామూర్తిమనోజ్ఞాయై నమో నమః || 51 ||


హయమేధాగ్రసంపూజ్యమహిమాయై నమో నమః |
దక్షప్రజాపతిసుతవేషాఢ్యాయై నమో నమః || 52 ||


సుమబాణేక్షుకోదండమండితాయై నమో నమః |
నిత్యయౌవనమాంగల్యమంగళాయై నమో నమః || 53 ||


మహాదేవసమాయుక్తశరీరాయై నమో నమః |
చతుర్వింశతితత్త్వైక్యస్వరూపాయై నమో నమః || 54 ||


శ్రీ దుర్గాష్టోత్తర శతనామస్తోత్రం

దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీచ చండికా |
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా || 1 ||

 
సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా |
భూమిజా నిర్గుణాధారశక్తిశ్చానీశ్వరీ తథా || 2 ||

 
నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ |
సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా || 3 ||

 
పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ |
తేజోవతీ మహామాతా కోతిసూర్యసమప్రభా || 4 ||

 
దేవతా వహ్నిరూపా చ సరోజా వర్ణరూపిణీ |
గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా || 5 ||

 
కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ |
ధర్మజ్ఞానా ధర్మనిష్టా సర్వకర్మవివర్జితా || 6 ||

 
కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా |
శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా || 7 ||

 
సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా |
శాస్త్రా శాస్త్రమయా నిత్యా శుభా చంద్రార్ధమస్తకా || 8 ||

 
భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా |
బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరివృతా || 9 ||

 
జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యాధికారిణీ |
బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా || 10 ||

 
కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ |
యోగనిష్ఠా యోగగమ్యా యోగధ్యేయా తపస్వినీ || 11 ||

 
జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్టఫలప్రదా |
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ || 12 ||

 
స్వధానారీమధ్యగతా షడాధారాదివర్ధినీ |
మోహితాంశుభవా శుభ్రా సూక్ష్మా మాత్రా నిరాలసా || 13 ||

 
నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా |
సర్వజ్ఞానప్రదానందా సత్యా దుర్లభరూపిణీ || 14 ||

 
సరస్వతీ సర్వగతా సర్వాభీష్టప్రదాయినీ |
ఇతి శ్రీదుర్గా అష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ||


శ్రీ కృష్ణాష్టోత్తరశతనామస్తోత్రం

శ్రీకృష్ణః కమలానాథో వాసుదేవః సనాతనః |
వాసుదేవాత్మజః పుణ్యో లీలామానుషవిగ్రహః || 1 ||


శ్రీవత్సకౌస్తుభధరో యశోదావత్సలో హరిః |
చతుర్భుజాత్తచక్రాసిగదాశంఖాంబుజాయుధః || 2 ||


దేవకీనందనః శ్రీశో నందగోపప్రియాత్మజః |
యమునావేగసంహారీ బలభద్రప్రియానుజః || 3 ||


పూతనాజీవితహరః శకటాసురభంజనః |
నందవ్రజజనానందీ సచ్చిదానందవిగ్రహః || 4 ||


నవనీతవిలిప్తాంగో నవనీతనటోzనఘః |
నవనీతనవాహారో ముచుకుందప్రసాదకః || 5 ||


శుకవాగమృతాబ్ధీందుర్గోవిందో యోగినాంపతిః |
వత్సవాటచరోzనంతో ధేనుకాసురభంజనః || 6 ||


తృణీకృతతృణావర్తో యమళార్జునభంజనః |
ఉత్తాలతాలభేత్తా చ తమాలశ్యామలాకృతిః || 7 ||


గోపీగోపీశ్వరో యోగీ సూర్యకోటిసమప్రభః |
ఇళాపతిః పరంజ్యోతిర్యాదవేంద్రో యదూద్వహః || 8 ||


వనమాలీ పీతవాసాః పారిజాతాపహారకః |
గోవర్ధనాచలోద్ధర్తా గోపాలః సర్వపాలకః || 9 ||


అజో నిరంజనః కామజనకః కంజలోచనః |
మధుహా మథురానాథో ద్వారకానాయకో బలీ || 10 ||


బృందావనాంతసంచారీ తులసీదామభూషణః |
శమంతకమణేర్హర్తా నరనారాయణాత్మకః || 11 ||


కుబ్జాకృష్ణాంబరధరో మాయీ పరమపూరుషః |
ముష్టికాసురచాణూరమల్లయుద్ధవిశారదః || 12 ||


సంసారవైరీ కంసారిర్మురారిర్నరకాంతకః |
అనాదిర్బ్రహ్మచారీ చ కృష్ణావ్యసనకర్షకః || 13 ||


శిశుపాలశిరచ్ఛేత్తా దుర్యోధనకులాంతకః |
విదురాక్రూరవరదో విశ్వరూపప్రదర్శకః || 14 ||


సత్యవాక్ సత్యసంకల్పః సత్యభామారతో జయీ |
సుభద్రాపూర్వజో విష్ణుర్భీష్మముక్తిప్రదాయకః || 15 ||


జగద్గురుర్జగన్నాథో వేణువాద్యవిశారదః |
వృషభాసురవిధ్వంసీ బాణాసురబలాంతకృత్ || 16 ||


యుధిష్ఠిరప్రతిష్ఠాతా బర్హిబర్హావతంసకః |
పార్థసారథిరవ్యక్తో గీతామృతమహోదధిః || 17 ||


కాళీయఫణిమాణిక్యరంజితశ్రీపదాంబుజః |
దామోదరో యజ్ఞభోక్తా దానవేంద్రవినాశకః || 18 ||


నారాయణః పరంబ్రహ్మ పన్నగాశనవాహనః |
జలక్రీడాసమాసక్తగోపీవస్త్రాపహారకః || 19 ||


పుణ్యశ్లోకస్తీర్థకరో వేదవేద్యో దయానిధిః |
సర్వతీర్థాత్మకః సర్వగ్రహరూపీ పరాత్పరః || 20 ||


ఇత్యేవం కృష్ణదేవస్య నామ్నామష్టోత్తరం శతమ్ |
కృష్ణేన కృష్ణభక్తేన శ్రుత్వా గీతామృతం పురా || 21 ||


స్తోత్రం కృష్ణప్రియకరం కృతం తస్మాన్మయా పురా |
కృష్ణనామామృతం నామ పరమానందదాయకమ్ || 22 ||


అనుపద్రవదుఃఖఘ్నం పరమాయుష్యవర్ధనమ్
దానం శ్రుతం తపస్తీర్థం యత్కృతం త్విహ జన్మని || 23 ||


పఠతాం శృణ్వతాం చైవ కోటికోటిగుణం భవేత్ |
పుత్రప్రదమపుత్రాణామగతీనాం గతిప్రదమ్ || 24 ||


ధనావహం దరిద్రాణాం జయేచ్ఛూనాం జయావహమ్ |
శిశూనాం గోకులానాం చ పుష్టిదం పుష్టివర్ధనమ్ || 25 ||


వాతగ్రహజ్వరాదీనాం శమనం శాంతిముక్తిదమ్ |
సమస్తకామదం సద్యః కోటిజన్మాఘనాశనమ్ || 26 ||


అంతే కృష్ణస్మరణదం భవతాపభయాపహమ్ |
కృష్ణాయ యాదవేంద్రాయ జ్ఞానముద్రాయ యోగినే |

నాథాయ రుక్మిణీశాయ నమో వేదాంతవేదినే || 27 ||

ఇమం మంత్రం మహాదేవి జపన్నేవ దివానిశమ్ |
సర్వగ్రహానుగ్రహభాక్ సర్వప్రియతమో భవేత్ || 28 ||

పుత్రపౌత్రైః పరివృతః సర్వసిద్ధిసమృద్ధిమాన్ |
నిర్విశ్య భోగానంతేపి కృష్ణసాయుజ్యమాప్యునాత్ || 29 ||

శ్రీ విఘ్నేశ్వరాష్టోత్తర శతనామస్తోత్రం

వినాయకో విఘ్నరాజో గౌరీపుత్రో గణేశ్వరః |
స్కందాగ్రజోవ్యయః పూతో దక్షోzధ్యక్షో ద్విజప్రియః || 1 ||

 
అగ్నిగర్వచ్ఛిదింద్రశ్రీప్రదో వాణీప్రదోzవ్యయః
సర్వసిద్ధిప్రదశ్శర్వతనయః శర్వరీప్రియః || 2 ||

 
సర్వాత్మకః సృష్టికర్తా దేవోనేకార్చితశ్శివః |
శుద్ధో బుద్ధిప్రియశ్శాంతో బ్రహ్మచారీ గజాననః || 3 ||

 
ద్వైమాత్రేయో మునిస్తుత్యో భక్తవిఘ్నవినాశనః |
ఏకదంతశ్చతుర్బాహుశ్చతురశ్శక్తిసంయుతః || 4 ||

 
లంబోదరశ్శూర్పకర్ణో హరర్బ్రహ్మ విదుత్తమః |
కాలో గ్రహపతిః కామీ సోమసూర్యాగ్నిలోచనః || 5 ||

 
పాశాంకుశధరశ్చండో గుణాతీతో నిరంజనః |
అకల్మషస్స్వయంసిద్ధస్సిద్ధార్చితపదాంబుజః || 6 ||

 
బీజపూరఫలాసక్తో వరదశ్శాశ్వతః కృతీ |
ద్విజప్రియో వీతభయో గదీ చక్రీక్షుచాపధృత్ || 7 ||

 
శ్రీదోజ ఉత్పలకరః శ్రీపతిః స్తుతిహర్షితః |
కులాద్రిభేత్తా జటిలః కలికల్మషనాశనః || 8 ||

 
చంద్రచూడామణిః కాంతః పాపహారీ సమాహితః |
అశ్రితశ్రీకరస్సౌమ్యో భక్తవాంఛితదాయకః || 9 ||

 
శాంతః కైవల్యసుఖదస్సచ్చిదానందవిగ్రహః |
జ్ఞానీ దయాయుతో దాంతో బ్రహ్మద్వేషవివర్జితః || 10 ||

 
ప్రమత్తదైత్యభయదః శ్రీకంఠో విబుధేశ్వరః |
రమార్చితోవిధిర్నాగరాజయజ్ఞోపవీతవాన్ || 11 ||

 
స్థూలకంఠః స్వయంకర్తా సామఘోషప్రియః పరః |
స్థూలతుండోzగ్రణీర్ధీరో వాగీశస్సిద్ధిదాయకః || 12 ||

 
దూర్వాబిల్వప్రియోzవ్యక్తమూర్తిరద్భుతమూర్తిమాన్ |
శైలేంద్రతనుజోత్సంగఖేలనోత్సుకమానసః || 13 ||

 
స్వలావణ్యసుధాసారో జితమన్మథవిగ్రహః |
సమస్తజగదాధారో మాయీ మూషకవాహనః || 14 ||

 
హృష్టస్తుష్టః ప్రసన్నాత్మా సర్వసిద్ధిప్రదాయకః |
అష్టోత్తరశతేనైవం నామ్నాం విఘ్నేశ్వరం విభుం || 15 ||

 
తుష్టావ శంకరః పుత్రం త్రిపురం హంతుముత్యతః |
యః పూజయేదనేనైవ భక్త్యా సిద్ధివినాయకమ్ || 16 ||

 
దూర్వాదళైర్బిల్వపత్రైః పుష్పైర్వా చందనాక్షతైః |
సర్వాన్కామానవాప్నోతి సర్వవిఘ్నైః ప్రముచ్యతే ||